
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నాగర్‌కర్నూల్ జిల్లాలో నిరసనలు చేపట్టారు.
వెల్దండ, బిజినేపల్లి, తిమ్మాజిపేట మండలాల్లోని విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించి, 18 గంటల విద్యుత్ సరఫరా కోరుతూ ఏఈకి వినతిపత్రాలు అందజేశారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, గోలి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.