
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాంశ్ తదితర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో కుటుంబసభ్యుల సమక్షంలో వినాయక ప్రతిమను ప్రతిష్టించి పూజలు జరిపారు.