
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఢిల్లీలో స్పందిస్తూ, అనుమతులు లేకుండా విదేశీ పర్యటనకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానించిన న్యూయార్క్ మేయర్ మామ్దానీతో రేవంత్ రెడ్డి భేటీ కావడంపై కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమాధానం కోరారు.
గతంలో నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన విదేశీ పర్యటనను నిరాకరించిందని, ఇది సాధారణ ప్రక్రియేనని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.