
రాజాం మెయిన్ రోడ్డులో గిఫ్ట్ షాపు నిర్వహిస్తున్న పట్నాల కొండరాజును రూ.1000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించిన రౌడీషీటర్ రౌతు రాజును పోలీసులు అరెస్టు చేశారు.
ఈనెల 13న షాపు వద్దకు వచ్చిన నిందితుడు, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని హెచ్చరించడంతో బాధితుడు రూ.1300 విలువైన క్యారమ్ బోర్డును ఇచ్చి పంపాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సల్మాన్ బేగ్ కేసు నమోదు చేయగా, నిందితుడిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కోసం కోర్టులో ప్రవేశపెట్టారు.