
అమెజాన్ తన క్విక్ డెలివరీ సర్వీస్ ‘అమెజాన్ నౌ’ను తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు విస్తరించింది.
సంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
దీపావళి నాటికి ఈ సేవలను 100 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది.