
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం విధించిన కొత్త దిగుమతి సుంకాలపై 25 డెమొక్రటిక్ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
గత నెలలో 60 దేశాలపై 10 నుంచి 12.5 శాతం వరకు అమెరికా కొత్త సుంకాలను విధించగా, వాటిని కోర్టు కొట్టివేసినా మళ్లీ అమలు చేస్తున్నారని రాష్ట్రాలు ఆరోపించాయి.
ఈ పన్నుల భారం ప్రజలపై తీవ్ర అన్యాయమని న్యూయార్క్ అటార్నీ జనరల్ పేర్కొనగా, ఈ పిటిషన్ ద్వారా సుంకాల అమలును అడ్డుకోవాలని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి.