
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించగా, ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన నమన్ ధీర్‌ను మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తప్పుబట్టారు.
దేశవాళీ క్రికెట్‌లో గొప్ప రికార్డు లేని నమన్ ధీర్ భారత జట్టుకు ఆడేందుకు అర్హుడు కాదని, ఇండియన్ క్యాప్ అంత సులభంగా దక్కకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ మ్యాచ్‌లో నమన్‌కు బ్యాటింగ్ అవకాశం రానప్పటికీ, బౌలింగ్‌లో 5 ఓవర్లు వేసి 33 పరుగులిచ్చి వికెట్లేమీ సాధించలేకపోయాడు.