
ఇరాన్‌లోని అప్రకటిత ప్రదేశాల్లో లభించిన యురేనియం ఆనవాళ్లపై దర్యాప్తునకు సహకరించలేదని ఐఏఈఏ బోర్డు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నివేదించింది.
గత 20 ఏళ్లలో ఇరాన్ అంశంపై భద్రతా మండలికి నివేదించడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు.
35 మంది సభ్యులున్న బోర్డులో 23 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, రష్యా, చైనా వ్యతిరేకించాయి.