
కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ప్రభుత్వ భూములు మరియు చెరువుల శిఖం భూములలో ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు.
బస్టాండ్ ఎదురుగా ఉన్న వివాదాస్పద భారీ భవన నిర్మాణంపై కూడా సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.