
అమెరికాలోని వర్జీనియాలో చేపల రాకపోకల కోసం 70 ఏళ్ల నాటి హార్వెల్ డ్యామ్‌ను అధికారులు కూల్చివేశారు.
ఈ డ్యామ్ తొలగింపుతో 200 కిలోమీటర్ల మేర నది స్వేచ్ఛగా ప్రవహిస్తూ, చేపల సంతానోత్పత్తికి అనుకూలంగా మారింది.
డ్యామ్ తొలగించిన ఏడాదిలోనే అరుదైన చేప జాతులు నదికి ఎదురు ఈదుకుంటూ వెళ్లడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.