
ఇస్లామాబాద్‌లోని పీఐఎంఎస్ ఆసుపత్రిలో బుధవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది నవజాత శిశువులు సజీవదహనమయ్యారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఆక్సిజన్ లైన్ల ద్వారా వార్డు అంతటా వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ ఫెడరల్ హెల్త్ సెక్రటరీ ముహమ్మద్ అస్లాం గౌరీని సస్పెండ్ చేసి, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.