
తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విశాఖ జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సూచించారు.
భారీ వర్షాల ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో విపత్తు నిర్వహణ చర్యలపై అధికారులను ఆయన అప్రమత్తం చేశారు.
వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.