
సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శించేందుకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో, మాజీ మంత్రులు హరీశ్‌రావు మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కోకాపేట్‌లోని హరీశ్‌రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించగా, సనత్ నగర్, అమీర్‌పేట డివిజన్లకు చెందిన ముఖ్య నాయకులను కూడా పోలీసులు నిర్బంధించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆస్పత్రిని సందర్శించాలని నిర్ణయించుకున్నామని, తమను అక్రమంగా నిర్బంధిస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.