
పల్నాడు జిల్లా యడ్లపాడులో ఇంటికి తాళం వేసి ఉండగా దుండగులు చొరబడి రూ. 75 లక్షల విలువైన సొత్తును దొంగిలించారు.
బాధితురాలు హైదరాబాద్ వెళ్లిన సమయంలో జరిగిన ఈ చోరీలో 46 సవర్ల బంగారం, 5 కిలోల వెండి, రూ. 50 వేల నగదు అపహరణకు గురయ్యాయి.
ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.