
కంప్యూటర్ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన యాపిల్-1 కంప్యూటర్ అంతర్జాతీయ వేలంలో ఏకంగా రూ. 10.9 కోట్లకు (1.15 మిలియన్ డాలర్లు) అమ్ముడైంది.
బోన్హామ్స్ నిర్వహించిన ఈ వేలంలో ఇద్దరు కొనుగోలుదారుల మధ్య దాదాపు 28 నిమిషాల పాటు పోటీ జరిగింది.
ఈ కంప్యూటర్ మదర్బోర్డుపై హార్డ్వేర్ రూపకర్త స్టీవ్ వోజ్నియాక్ సంతకం ఉండటం దాని ప్రత్యేకతను మరింత పెంచింది.