
అవినాష్ కొకటి దర్శకత్వంలో అప్సరరాణి, నైనిక అనసూయ నటించిన 'డార్క్ సీక్రెట్స్' ఆంథాలజీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె విధానంలో ఉన్న టాప్ 10 ఇండియన్ సినిమాల్లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.
మానవ మనస్తత్వంలోని రహస్యాలు, కోరికల నేపథ్యంలో సాగే ఈ చిత్రం వివిధ భాషల చిత్రాలతో పోటీ పడి దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది.