నవంబర్ రెండో వారం తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చుననే వాతావరణ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
అయితే ఇది ప్రస్తుతానికి వాతావరణ మోడల్ అంచనా మాత్రమేనని, ఏపీకి గణనీయమైన తుపాను ముప్పు లేదని ఏపీఎస్‌డీఎంఏ స్పష్టం చేసింది.
కొన్ని అంచనాల్లో నెల్లూరు, తిరుపతి వంటి జిల్లాల్లో వర్షాలు ఉండవచ్చని సూచనలున్నప్పటికీ, ఇప్పటివరకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ కాలేదు.