
ఒక మహిళ ఇంట్లోకి మారువేషంలో వెళ్లిన వ్యవహారంలో ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌ను పార్టీ అధిష్టానం బహిష్కరించింది.
పార్టీని వీడటంతో పాటు ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని అధిష్టానం ఆయనను ఆదేశించింది.
అయితే, పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని రహ్మత్ బేగ్ స్పష్టం చేశారు.