
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ నెల 23 నుంచి 25 వరకు అమెరికాలో పర్యతించనున్నారు అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా వెల్లడించింది.
ఈ పర్యటనకు సన్నాహకంగా న్యూయార్క్లో ఆదివారం ఇరుదేశాల అధికారుల మధ్య ఆర్థిక, వాణిజ్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలపై చర్చలు జరిగాయి.
రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే చైనా, భారత్ వంటి దేశాలపై 100 శాతానికి పైగా టారిఫ్లు విధించేలా అధికారం కట్టబెట్టిన చట్టంపై ట్రంప్ సంతకం చేశారు.