
నిరుద్యోగులకు ఊరటనిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి మొత్తం 10,060 పోస్టులతో కూడిన జాబ్ క్యాలెండర్‌ను అధికారికంగా విడుదల చేసింది.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ స్థాయిల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ క్యాలెండర్ ద్వారా మార్గం సుగమం అయింది.
రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుండగా, ప్రభుత్వం నిర్ణీత కాలపరిమితిలో నియామక ప్రక్రియను పూర్తి చేయనుంది.