
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి 14 శాతం వృద్ధితో రూ.23,038 కోట్ల స్టాండ్‌ఎలోన్ నికర లాభాన్ని ప్రకటించింది.
సమీక్షా కాలంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.1,43,796 కోట్లకు పెరిగిందని, నికర వడ్డీ ఆదాయం 14.69 శాతం వృద్ధి చెంది రూ.49,143 కోట్లకు చేరిందని బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.
సెప్టెంబరు చివరినాటికి స్థూల నిరర్ధక ఆస్తులు 1.39 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.36 శాతానికి తగ్గాయి.