
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, 'బలగం' ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎల్లమ్మ' చిత్రంతో కథానాయకుడిగా వెండితెరపైకి అడుగుపెడుతున్నారు.
ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ 'పర్షి' అనే పాత్రలో నటిస్తుండగా, తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన దేవిశ్రీ ప్రసాద్, ఈ సినిమాతో నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.