
హెచ్ఐవి వ్యాప్తిని అడ్డుకునే 'లేనాకాపవిర్' ఇంజెక్షన్‌ను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు డాక్టర్ రెడ్డీస్, ఎమ్క్యూర్ సంస్థలకు కేంద్ర నిపుణుల కమిటీ అనుమతులు ఇచ్చింది.
ఈ ఔషధాన్ని 35 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండి, హెచ్ఐవి నెగెటివ్ అని తేలిన పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు ముందుస్తు జాగ్రత్తగా వాడుకోవచ్చు.
మార్కెటింగ్ అనుమతి పొందిన మూడు నెలల్లోపు కంపెనీలు ఫేజ్-4 క్లినికల్ అధ్యయన ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించాలని నిపుణుల కమిటీ కఠిన నిబంధనలు విధించింది.