తెలంగాణ ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయగా, ఏఎస్డీ కేటగిరీలో ఉన్న సుమారు 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు సీఈవో సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.
నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 16లోపు వివరాలను నిర్ధారించుకోవాలని, అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదలవుతుందని అధికారులు తెలిపారు.