
అనిల్ అగర్వాల్‌కు చెందిన మైనింగ్ దిగ్గజం వేదాంతా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలను సాధించింది.
జూలై-సెప్టెంబర్ క్యూ2 కాలంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 3,650 కోట్లను అధిగమించింది.
కమోడిటీల ధరలు పుంజుకోవడం, సానుకూల ఫారెక్స్ కదలికలు, అమ్మకాల పరిమాణం పెరగడం ఇందుకు దోహదపడ్డాయని కంపెనీ వెల్లడించింది.