
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పదేళ్లుగా జరుగుతున్నప్పటికీ నాణ్యమైన క్రికెటర్లను వెలికితీయడంలో విఫలమైందని మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ విమర్శించారు.
వైభవ్ సూర్యవంశీ లాంటి అద్భుతమైన నైపుణ్యం కలిగిన ఒక్క ఆటగాడినైనా పాకిస్థాన్ లీగ్ తయారు చేసిందా అని ఆయన ప్రశ్నించారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరియు లీగ్ నిర్వహణ తీరుపై అక్రమ్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.