దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, నిఫ్టీ 50 వరుసగా ఏడో వారం కూడా నష్టపోవడం ఆరేళ్లలో ఇదే ప్రథమం.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న క్రూడ్ ధరలు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు మరియు విదేశీ పెట్టుబడిదారుల భారీ అమ్మకాలు మార్కెట్‌ను దెబ్బతీశాయి.
సెప్టెంబర్ 25 వరకు విదేశీ మదుపరులు రూ. 18,531 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు రూ. 52,617 కోట్ల కొనుగోళ్లతో మద్దతునిచ్చారు.