
పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో చనిపోయిన తన రెండు వారాల పిల్ల డాల్ఫిన్‌ను తల్లి డాల్ఫిన్ నీటిపై మోసుకెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
పరిశోధకులు డ్రోన్ ద్వారా చిత్రీకరించిన ఈ వీడియోలో, పిల్ల డాల్ఫిన్ శ్వాస సంబంధిత సమస్యలతో మరణించినట్లు గుర్తించారు.
జంతువులకు కూడా మనుషుల మాదిరిగానే దుఃఖం ఉంటుందనే చర్చకు ఈ ఘటన దారితీసింది.