
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి.
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో (MCX) వరుసగా మూడో రోజూ ఈ రెండు విలువైన లోహాల ధరలు పైపైకి కదిలాయి.
అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో ఉన్నట్టుండి ఈ రెండు లోహాల ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.