
జపాన్‌లో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ మహిళల 200 మీటర్ల టీ12 ఫైనల్లో భారత స్టార్ పారా స్ప్రింటర్ సిమ్రాన్ శర్మ 24.80 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకాన్ని సాధించగా, తేజల్బెన్ దామోర్ 25.23 సెకన్లతో కాంస్యం కైవసం చేసుకున్నారు.
ఇదే రేసులో ఇరాన్ స్ప్రింటర్ హజార్ సఫార్జాదే 25.02 సెకన్లతో రజత పతకాన్ని దక్కించుకున్నారు.
ఈ పారా గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు మొత్తం 26 పతకాలను తన ఖాతాలో వేసుకుంది.