
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడుల వల్ల ప్రపంచ బిలియనీర్ల సంపద 2025 నాటికి 15.1 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు అల్ట్రాటా నివేదిక వెల్లడించింది.
గత ఏడాదితో పోలిస్తే బిలియనీర్ల సంఖ్య 8.2 శాతం పెరిగి 3,795కి చేరుకోగా, వారి సంపద 12.8 శాతం వృద్ధి చెందింది.
ఉత్తర అమెరికా 1,337 మంది బిలియనీర్లతో అగ్రస్థానంలో ఉండగా, 29 మంది సూపర్ బిలియనీర్ల చేతిలోనే మొత్తం సంపదలో 27 శాతం కేంద్రీకృతమై ఉంది.