
ఎల్‌వీఎం3 రాకెట్ ఏడవ మిషన్ కోసం ఇస్రో మహేంద్రగిరిలోని ఐపీఆర్‌సీ కేంద్రంలో గురువారం క్రయోజనిక్ ఇంజిన్ హాట్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది.
సీఈ-20 ఇంజిన్ పనితీరు అన్ని లక్ష్యాలను చేరుకుందని, గగన్‌యాన్ కోసం సీఈ-32 దశ ఎల్‌ఓఎక్స్ ట్యాంక్ ప్రెషరైజేషన్ మాడ్యూల్ కూడా విజయవంతంగా పనిచేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
భవిష్యత్తులో ఎల్‌వీఎం3 రాకెట్ల పేలోడ్ సామర్థ్యాన్ని పెంచేందుకు 22 టన్నుల థ్రస్ట్ స్థాయిలో ఈ ఇంజిన్లను రూపొందిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది.