
ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరగనున్న అనధికారిక వన్డే సిరీస్కు హార్దిక్ పాండ్యాను భారత-ఎ జట్టులోకి ఎంపిక చేశారు.
సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 11 వరకు పుదుచ్చేరి వేదికగా జరగనున్న ఈ సిరీస్లో టెస్టులకు దేవదత్ పడిక్కల్, వన్డేలకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తారు.
హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ ఆధారంగానే మైదానంలోకి అడుగుపెడతారని బీసీసీఐ సెలక్షన్ కమిటీ స్పష్టం చేసింది.