
అనంతపురం జిల్లా రాప్తాడులో పాఠశాల తరగతి గదిలో విద్యార్థినిపై రంపంతో దాడి జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై అధికారులతో మాట్లాడిన సీఎం, నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.
ఉన్మాదులను ఉక్కు పాదంతో అణచివేస్తామని ఈ ఘటనపై స్పందిస్తూ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.