
అరుదైన జన్యు వ్యాధి 'లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ'తో బాధపడుతున్న 18 ఏళ్ల శశి భవ్యతకు సినీ నటుడు రామ్ పోతినేని ఆర్థిక సాయం ప్రకటించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా బాలిక పరిస్థితిని తెలుసుకున్న రామ్, ఆమెతో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
బాలికకు అవసరమైన మందులు, వైద్య ఖర్చులను పూర్తిగా భరిస్తానని, నిపుణులైన వైద్యులతో మెరుగైన చికిత్స అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.