
దమ్మామ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో బాంబు ఉందని బెదిరింపు రావడంతో, సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఉదయం 10:25 గంటలకు బయలుదేరిన విమానంలోని వాష్‌రూమ్‌లో 'బాంబ్' అని రాసి ఉన్న టిష్యూ పేపర్‌ను సిబ్బంది గుర్తించడంతో, సాయంత్రం 4:22 గంటలకు విమానాన్ని సురక్షితంగా దించారు.
సీఐఎస్ఎఫ్ మరియు బాంబ్ నిర్వీర్యక దళాలు విమానం, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని అధికారులు స్పష్టం చేశారు.