
భవిష్యత్తులో రాబోయే చాట్‌జీపీటీ వెర్షన్ వినియోగదారుల కంప్యూటర్ స్క్రీన్, మీటింగ్స్, కాల్స్‌ను గమనిస్తూ సందర్భాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సామ్ ఆల్ట్‌మన్ తెలిపారు.
ఈ ఏఐ అసిస్టెంట్ ఆరు నెలల్లో అందుబాటులోకి రానుందని, ఇది యూజర్ల అనుమతితో ఈమెయిల్స్, డాక్యుమెంట్లను పరిశీలించి సూచనలు ఇస్తుందని పేర్కొన్నారు.
వినియోగదారులు ఏ సమాచారాన్ని ఏఐతో పంచుకోవాలో వారే నిర్ణయించుకోవచ్చని, ఇది కేవలం సహాయకారిగా మాత్రమే పనిచేస్తుందని ఓపెన్‌ఏఐ సీఈఓ వివరించారు.