
భారత జట్టు తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని వన్డేల్లో కూడా ఆడించాలని మాజీ ఆటగాడు ఫారూక్ ఇంజనీర్ సూచించారు.
రోహిత్ శర్మకు జోడీగా వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా పంపాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
టీనేజీ సంచలనంగా పేరు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వన్డే ఫార్మాట్లో కూడా పరీక్షించాలని ఆయన పేర్కొన్నారు.