
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్ జాదుమణి సింగ్, పాకిస్థాన్‌కు చెందిన సుమామ రెహమాన్‌పై 5-0తో ఏకపక్ష విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరాడు.
పురుషుల 55 కేజీల విభాగంలో జరిగిన ఈ పోరులో, మణిపూర్‌కు చెందిన 22 ఏళ్ల జాదుమణి తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఈ విజయాన్ని భారత సైనికులకు అంకితం చేసిన జాదుమణి, క్వార్టర్స్‌లో గెలిస్తే భారత్‌కు పతకం ఖాయమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.