
కాకినాడ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్‌ను పోలీసులు యూపీలోని మేరఠ్‌లో అరెస్టు చేసి కాకినాడకు తరలించారు.
నిందితుడు గత 5 రోజుల్లో 4 రాష్ట్రాల్లో తిరుగుతూ, కేరళ మీదుగా సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోయేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ నెల 16న నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రాత్రి, సాధిక్ సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.