
కండరాల బలానికి ప్రోటీన్ అవసరమే అయినప్పటికీ, పరిమితికి మించి తీసుకోవడం వల్ల కిడ్నీలు, కాలేయం మరియు ఎముకలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అధిక ప్రోటీన్ తీసుకునే వారు ఫైబర్ తక్కువగా వాడటం వల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
కొన్ని సందర్భాల్లో ఇది అధిక రక్తపోటును పెంచి గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదాలకు దారితీస్తుందని, కాబట్టి డైటీషియన్ సలహాతోనే ప్రోటీన్ మోతాదును నిర్ణయించుకోవాలని నిపుణులు సూచించారు.