
డాబర్ ఇండియా ఉత్పత్తులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ విధించిన నిషేధాజ్ఞలపై ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 24 వరకు స్టే విధించింది.
తేనె, నెయ్యి, యాపిల్ సైడర్ వెనిగర్ వంటి ఉత్పత్తులపై '100 శాతం ప్యూర్' అని ప్రచారం చేయడం వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
కంపెనీకి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా నిషేధం విధించడం సరికాదని జస్టిస్ అమిత్ మహాజన్ పేర్కొంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేశారు.