
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏసీటీవోగా పనిచేస్తున్న కోతి వెంకటేశ్వర్లును, ఆస్తి వివాదాల నేపథ్యంలో భార్య రాజమణి రోలుతో కొట్టి హత్య చేసింది.
ఆగస్టు 31న వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆ ఆర్థిక ప్రయోజనాల కోసం జరిగిన గొడవలో ఈ దారుణం చోటుచేసుకుంది.
నిందితురాలు రాజమణిపై కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తును వేగవంతం చేశారు.