బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను, ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలోని పలు జిల్లాలలో రాగల మూడు రోజులు ఉరుములు, ఈదురుగాలులతో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
తీర ప్రాంత ప్రజలు మరియు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.