
ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా 24 ఏళ్ల క్రితం మరణించిన భర్త పేరుతో బతికున్న భార్య ఓటును తొలగించాలంటూ ఆన్లైన్లో ఫారం-7 దాఖలైంది.
ముషీరాబాద్ నియోజకవర్గంలో గతంలో మాన్యువల్‌గా 31 నకిలీ ఫారం-7లు సమర్పించినట్లు తేలడంతో బీఎల్ఏ బాలచందర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ అక్రమాలపై సమగ్ర విచారణకు ఎన్నికల అధికారులు ఆదేశించారు.