
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరలో జరిగిన పార్టీ నేత బాషబోయిన బాలప్రసాద్ వివాహంలో కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యురాలిగా పాల్గొన్నారు.
ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం వరుడికి అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో, కవిత ఆడబిడ్డగా వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడు ముళ్లు వేశారు.
ఈ కార్యక్రమంలో కవిత గౌరీ పూజలో పాల్గొని, వధువుకు ఉంగరం తొడిగి, ఒడిబియ్యం పోసి ఆశీర్వదించడంతో వివాహ తంతు పూర్తయింది.