
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉన్న నోష్కి పట్టణంలో రాకేశ్ కుమార్ అనే హిందూ వ్యాపారిని గుర్తుతెలియని సాయుధులు కాల్చి చంపారు.
దుకాణంలోకి చొరబడిన దుండగులను ప్రతిఘటించిన క్రమంలో రాకేశ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారని స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ హత్యను ఖండించిన అసెంబ్లీ సభ్యుడు గురుపాల్ సింగ్, అమాయక హిందూ పౌరులను లక్ష్యంగా చేసుకుని భయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.