
పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అడ్డుకోవడంపై పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అభ్యర్థుల నామినేషన్లు సజావుగా సాగేలా చూడాలని, పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల బరిలో నిలిచి తీరుతామని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.