తెలంగాణ ప్రభుత్వం శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభిస్తోంది.
నల్లగొండ జిల్లాలో 1,051 రేషన్ షాపుల పరిధిలోని 5,41,043 మంది లబ్ధిదారులకు ఈ డిజిటల్ కార్డులను పంపిణీ చేయనున్నారు.
ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే ఈ కార్డులలో క్యూఆర్ కోడ్, కుటుంబ సభ్యుల వివరాలు మరియు ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలు ముద్రించారు.