
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 'బాంబే క్రీమరీ' పేరుతో కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను ప్రారంభించి, రూ. 10 ప్రారంభ ధరతో మార్కెట్లోకి అడుగుపెట్టింది.
ఈ ఉత్పత్తులను తొలుత పశ్చిమ భారతదేశంలో అందుబాటులోకి తెచ్చిన కంపెనీ, దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
నిజమైన డెయిరీ క్రీమ్‌తో తయారు చేస్తున్న ఈ ఐస్‌క్రీమ్‌లు కోన్స్, కప్స్, టబ్స్ వంటి వివిధ ఫార్మాట్లలో లభిస్తాయని రిలయన్స్ ప్రకటించింది.